|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 08:17 PM
బాలీవుడ్ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగాయని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు అత్యంత కఠినమైన వృత్తి అని, తక్కువ జీతం వచ్చే వృత్తి అని ఆమె అన్నారు. రాజకీయరంగంలో ఉన్న కళాకారులు తమ వృత్తికి సమయం కేటాయిస్తే ఎగతాళికి గురవుతారని, ప్రజలు తమ అభిప్రాయాలు మార్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు వచ్చే జీతం సరిపోదని, నియోజకవర్గాలకు వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని, అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె గుర్తుచేశారు.
Latest News