|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 07:30 PM
మహాకుంభమేళాలో వైరలైన మోనాలీసా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే, డబ్బు వచ్చిన తర్వాత ఆమె రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని కొందరు డీప్ ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ డాన్స్ వీడియోకు మోనాలీసా ముఖాన్ని ఎడిట్ చేశారు. చాలా మంది దీన్ని నిజమని నమ్ముతున్నారు. ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతీది నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో మోనాలీసా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Latest News