|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:28 PM
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో మడమడక గ్రామానికి చెందిన 21 ఏళ్ల జట్టి దేవికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. అకాల వర్షాల కారణంగా మైనంపల్లి వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు మహిళను స్ట్రెచర్ పై వాగు దాటించి, దేవరకొండ ఏరియా ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు. వారి ధైర్యసాహసాలను మహిళా కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.