|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:27 PM
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.