|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:29 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 7న విడుదల కానున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా, పుష్ప సినిమా షూటింగ్ సమయంలో కథ, పాత్రపై గందరగోళంగా ఉండేదని, కేవలం సూచనల మేరకు నటించానని తెలిపింది. అయితే, పుష్ప 2లో మాత్రం పాత్రపై స్పష్టత వచ్చి, తన కెరీర్ లోనే అత్యుత్తమ నటన కనబరిచే అద్భుత అవకాశం లభించిందని, జాతర ఎపిసోడ్ లో పూర్తిగా లీనమై నటించానని రష్మిక వెల్లడించింది.