|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:21 PM
రాయికోడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ సత్యనారాయణ కపాస్ కిసాన్ యాప్ వినియోగం, స్లాట్ బుకింగ్ పై రైతులకు సూచనలు చేశారు. ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద శనగ విత్తనాల పంపిణీని ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. శనగ పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాని, వక్ఫ్ బోర్డు భూములున్న రైతులు ఈ నెల 23లోపు పంట నమోదు చేసుకోవాలని, లేదంటే కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేరని హెచ్చరించారు. 2018 తర్వాత మొబైల్ నంబర్ మార్చుకున్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.