ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:16 PM
కోల్ బెల్ట్ ఏరియాలోని కొత్తగూడెం, రుద్రంపూర్, రామవరం పట్టణాల్లో దీపావళి పండుగను విభిన్నంగా జరుపుకుంటున్నారు. గతించిన వారిని గుర్తు చేసుకుంటూ, వారి సమాధుల వద్ద దీపాలు వెలిగించి, ఇష్టమైన పదార్థాలను పెట్టి, పటాకులు కాల్చి వేడుకలు జరుపుకుంటున్నారు. సింగరేణి కార్మికులు తమ కుటుంబ అభ్యున్నతి కోసం ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేసి, మరణించిన వారి త్యాగాన్ని స్మరించుకునేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి, మరణించిన వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.