|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 10:08 AM
హెచ్-1బీ వీసాలపై అమెరికా వెళ్లే విదేశీ వృత్తి నిపుణులకు భారీ ఊరట లభించింది. వివాదాస్పదంగా మారిన లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) అప్లికేషన్ ఫీజుపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ రుసుము నుంచి పలు వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ టెకీలు ఊపిరి పీల్చుకున్నారు.కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన కేవలం అమెరికా బయట ఉండి, కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగి ఉన్నవారు అమెరికాలోకి ప్రవేశించడానికి గానీ, దేశం విడిచి వెళ్లడానికి గానీ ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.