|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 11:55 PM
విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, పేదలకు మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని తెలిపారు.ప్లేగ్రౌండ్, తగిన తరగతి గదులు మరియు మంచి వాతావరణం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అందుకోసం విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని, సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని సూచించారు.నర్సరీ నుండి నాల్గవ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించమని, అవి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్య అందించేలా ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయమని పేర్కొన్నారు.2026 జూన్ నుండి అకడమిక్ ఇయర్‌లో అమలు అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు.