|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 11:37 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ నేపథ్యంలో, నవంబర్ 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం, జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నవంబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించబడతాయి. నవంబర్ 22న నామినేషన్ల పరిశీలన నిర్వహించబడుతుంది.ఉపసంహరణకు గడువు నవంబర్ 24 వరకు ఉంది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. సెలవు రోజులు మినహా మిగతా పనిదినాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. అభ్యర్థులు నేరుగా కార్యాలయంలో లేదా డిజిటల్ విధానంలో దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.