|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 08:14 PM
TG: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులంతా నిరుత్సాహానికి గురయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్లకు సిద్ధమైన ఆశావహులు, పార్టీలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే నామినేషన్లు దాఖలు చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే, కోర్టు స్టే వారిని షాక్‌కు గురిచేసింది. హైకోర్టు స్టే విధించడంతో వారంతా ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు.