|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 09:17 PM
దేశీయ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవలను గూగుల్‌కు చెందిన జీమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన 'జోహో మెయిల్'కు మార్చుకున్నారు. ఈ మార్పును ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా ప్రకటించారు."అందరికీ నమస్కారం, నేను జోహో మెయిల్‌కు మారాను. దయచేసి నా ఈమెయిల్ అడ్రస్‌లో మార్పును గమనించగలరు. నా కొత్త ఈమెయిల్ చిరునామా: amitshah.bjp@zohomail.in. భవిష్యత్తులో నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు ఈ చిరునామాను ఉపయోగించగలరు" అని తన పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు.కేంద్ర మంత్రులు స్వదేశీ సాంకేతికత వైపు మొగ్గు చూపడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ప్లాట్‌ఫామ్‌కు మారారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అని ఆయన ప్రశంసించారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులు, సేవలను స్వీకరించాలని ఆయన కోరారు.