|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 02:50 PM
కన్నపిల్లలను చిత్రహింసలు పెట్టిన కసాయి తల్లి. మొహం, చెంపలపై వాతలు, గోళ్లలో కారం పెట్టి పిల్లలను దారుణంగా హింసించిన కన్నతల్లి. మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్ ప్రాంతంలో నివాసం ఉండే తాజుద్దీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న షబా నజ్వీమ్ అనే మహిళ. వీరికి రెండు, నాలుగేళ్ల ఇద్దరు పిల్లలు ఉండగా, భార్యభర్తలు విడాకులు తీసుకున్న కారణంగా తల్లి వద్దే ఉంటున్న పిల్లలు. రెండు నెలల క్రితం జోగిపేట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ జావేద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న నజ్వీమ్ . అప్పటి నుండి ఇద్దరు పిల్లలను హింసించడం మొదలు పెట్టగా, పిల్లల దుస్థితి చూసి పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు . ఘటనా స్థలానికి చేరుకుని చూడగా, పిల్లల వంటిపై పలుచోట్ల వాతలు, గోళ్లు కత్తిరించి వాటిలో కారం పెట్టినట్లు గుర్తించిన పోలీసులు . తల్లి నజ్వీమ్, జావేద్‌లను పోలీసులు అరెస్టు చేయడంతో, పిల్లలను తమ సంరక్షణలోకి తీసుకున్న సీడబ్ల్యూసీ