|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 05:57 PM
డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఆ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఒక కార్మికుడు మరణించిన ఘటనను నేపథ్యంగా చేసుకొని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీహార్‌కు చెందిన కూలీలు ఆందోళనకు దిగారు. వారి ఆగ్రహం అదుపుతప్పి విధ్వంసానికి దారి తీసింది.
నిరసన చేపట్టిన కూలీలు ఫ్యాక్టరీ ఆఫీస్‌లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీలోని పలు విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూలీల ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారటంతో వాతావరణం గందరగోళంగా మారింది.
పోలీసులపై దాడి: సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా, వారు కూడా ఆందోళనకారుల ఆగ్రహానికి గురయ్యారు. బీహార్ కూలీలు అధికారులను అడ్డుకుని, పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి దాడి చేశారు. దాంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
పరిస్థితిని అదుపులోకి తేవడంలో కష్టాలు: పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.