|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:52 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఏబీవీపీ – ఎస్ఎల్‌వీడీ కూటమి సెంట్రల్ ప్యానెల్‌లోని అన్ని పదవులను కైవసం చేసుకుంది.ఈ ఎన్నికల్లో కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా, శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శిగా, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈసారి ఓటింగ్ శాతం 81శాతం కన్నా ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ లాంటి ఇతర ప్రధాన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ సత్తా చాటింది.ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన తర్వాత హెచ్‌సీయూలో కూడా ఏబీవీపీ కూటమి విజయం సాధించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐటి సెల్ నాయకుడు అమిత్ మాల్వీయా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు.