|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 12:40 PM
కొత్త పార్టీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చించారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నా. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశా. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురిని నేనే. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు’ అని అన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.కార్ణాటక క్యాబినెట్ ఈ నెల 17న UKP దశ-3ని ఆమోదించింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచి, 100 TMC అదనపు నీటి నిల్వ చేయాలనే ప్లాన్ ఉంది. ఇది తెలంగాణకు 100-130 TMC నీరు తగ్గిస్తుందని BRS నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల నెట్టెంపాడు (2.5 లక్ష ఎకరాలు), పాలమూరు-రంగారెడ్డి (5 లక్ష), కల్వకుర్తి (3.5 లక్ష) ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (KWDT-II) 2013 అవార్డుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ, కార్ణాటక ముందుకు సాగుతోంది. "కార్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎడారిగా మార్చాలని కుట్ర పన్నుతోంది" అని కవిత మండిపడ్డారు.