|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:27 PM
జిన్నారం : పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. జిన్నారం మండలం కొర్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న చిత్తారమ్మ దేవాలయానికి గతంలో 26 లక్షల రూపాయల సొంత నిధులు అందించగా.. మిగిలిన పనుల కోసం మంగళవారం మరో రెండు లక్షల రూపాయలు అందించారు. అదే విధంగా.. జిన్నారంలో నిర్మిస్తున్న శివాజీ స్టేడియం బోర్డ్ ఏర్పాటు కోసం 37 వేల రూపాయలు, జిన్నారం పరిధిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో మంచి నీటి పైపులైన్లు, ఎర్తింగ్ పనుల కోసం 90 వేల రూపాయలను అందించారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచులు జనార్ధన్, శివరాజ్, ఆంజనేయుల సమక్షంలో సంబంధిత ప్రతినిధులకు డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులచే దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొడకంచి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడి సెంటర్ భవన నిర్మాణ పనులను ప్రతిఘటన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే ఆగస్టు నెలలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.