|
|
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 04:08 PM
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న అనేక మంది నిరుపేదులు, తగిన అర్హతలున్నా కూడా తమకు ఇంతవరకూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని వాపోయారు. శుక్రవారం రోజు సీపీఎం ఆధ్వర్యంలో వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆందోళనలో పాల్గొన్న వారు, నిజమైన అర్హులకే ఇండ్లు మంజూరు చేయాలని, మధ్యవర్తుల మాద్యమంగా జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ దరఖాస్తులను సమర్పించినప్పటికీ, వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఆందోళన అనంతరం ప్రతినిధుల బృందం మున్సిపాలిటీ కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు తగిన స్పందన చూపాలని స్పష్టం చేశారు.