![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:10 PM
రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మరింత బలోపేతం చేస్తామని, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోదీ తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల కలలను సాకారం చేయడమే తమ ధ్యేయమని అన్నారు. ఈ సందర్భంగా, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 'ది ఎమర్జెన్సీ డైరీస్' పేరుతో తాను ఒక పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా తన ప్రస్థానం, ఎమర్జెన్సీ రోజుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, తన అనుభవాలను ఆ పుస్తకంలో వివరంగా పొందుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకం ద్వారా నాటి చీకటి రోజులకు సంబంధించిన అనేక తెలియని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.