![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:07 PM
ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. మన దేశ రుచులు ఖండాంతరాలు దాటి విదేశీయుల మనసులను సైతం గెలుచుకుంటున్నాయి. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఓ తమిళ రెస్టారెంట్, భారతీయ ఆహార ప్రియుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.వివరాల్లోకి వెళితే... జెగత్ విజయ్ (@jegathvijay) అనే ఓ డిజిటల్ క్రియేటర్ ఇటీవల ప్యారిస్‌లోని 'మునియాండి విలాస్' అనే తమిళ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తన భోజన అనుభవాన్ని వివరిస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను పంచుకున్నారు. దాంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారి, ఫుడ్ లవర్స్ మధ్య హాట్ టాపిక్‌గా నిలిచింది.రెస్టారెంట్ బయట నుంచే లోపల వేడివేడిగా, పొరలు పొరలుగా పరోటాలు తయారుచేయడం స్పష్టంగా కనిపిస్తోందని వ్లాగర్ తన వీడియోలో చూపించారు. ఓ చెఫ్ ఎంతో నైపుణ్యంగా పరోటా పిండిని తిప్పుతూ, కాలుస్తూ ఉండటం ఆకట్టుకుంటుంది. "అది చూస్తుంటే, మన సొంత ఊరికి తిరిగి వెళ్లినట్లు అనిపించింది" అని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ రెస్టారెంట్ మెనూలో దక్షిణాది వంటకాలతో పాటు శ్రీలంక వంటకాలు కూడా ఉన్నాయని తెలిపారు.