|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:57 PM
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.రాష్ట్ర ఎకానమీకి అత్యంత కీలకమైన మైనింగ్ శాఖ బాధ్యతలను మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించిన సంగతి తెలిసిందే. గనుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వివేక్కు ఉన్న అనుభవం, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాఖలను కేటాయించారు.గతంలో వివేక్ తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) కూడా1978–1982 మధ్య ఉమ్మడి ఏపీలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలోనూ కార్మిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. వివేక్ అన్న గడ్డం వినోద్ కూడా ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.