|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 09:14 PM
BRS మాజీ మంత్రి హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైఫీవర్‌తో హైదరాబాద్‌లోని బేగంపేట కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రిలో హరీశ్ రావు చేరారు. కేటీఆర్ మీటింగ్ అనంతరం మధ్యలోనే హరీశ్ అస్వస్థతకు గురయ్యారు. కాసేపట్లో హరీశ్‌రావు వద్దకు కేటీఆర్ చేరుకోనున్నారు.. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. మాట తప్పినందుకు రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టాలన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా.. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తియుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ రేసును తీసుకువచ్చారన్నారు.