|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 11:17 AM
తండ్రి కుటుంబం కోసం చేసే త్యాగాలను గుర్తిస్తూ.. ప్రతి ఏడాది జూన్ మూడోవ ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 15వ తారీఖున వచ్చింది. తండ్రుల నిస్వార్థ త్యాగాలు, ప్రేమను గుర్తించి, వారిని సన్మానిస్తారు. కుటుంబం కోసం తండ్రి చేసే కష్టాన్ని గౌరవిస్తూ బహుమతులు, శుభాకాంక్షలతో ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇండియాలోనూ ఈ రోజును ఉత్సాహంగా జరుపుకుంటారు.అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే .. నాన్న కష్టాలు రాకుండా కావలి కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై జీవన పోరాటం చేస్తాడు. తన అలసటని కూడా కనపడనీయకుండా బతుకుబండిని నడిపిస్తాడు. కుటుంబ కోసం తన జీవితాన్ని ధారబోసే తండ్రి ప్రేమ, త్యాగానికి గుర్తుగా ప్రతి యేటా ఫాదర్స్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది (2025) ఫాదర్స్ డే జూన్ 15వ తేదీన వచ్చింది. అసలు ఫాదర్స్ డే ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా మొదలైంది.. దాని చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.
మనకు జీవితాన్ని ఇచ్చిన అమ్మా,నాన్నల్ని ప్రతిరోజు ప్రేమిస్తాం.. గౌరవిస్తాం. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకప్పుడు మనకు తెలియని ఫాదర్స్ డే, మదర్స్ డే లు మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఇండియాలో కూడా ఈ సెలబ్రేషన్స్‌కి ఇంపార్టెన్స్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఫాదర్స్ డే ఏటా జూన్ నెలలో వచ్చే మూడవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 15న ఫాదర్స్ డే. మన ఎదుగుదలకు కారణమైన తండ్రికి శుభాకాంక్షలు చెప్పడం.. బహుమతులు ఇవ్వడం.. వారి ఆశీస్సులు అందుకోవడం చేస్తారు.