|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 11:38 AM
TG: భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఢీకొని కింద పడిపోయారు. శ్రావణి (34) తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భర్త, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.