|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 12:44 PM
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రతి రోజు డివిజన్లో ఉన్న ప్రతి కాలనీలలో తప్పకుండా దోమల పొగ కొట్టాలని ఎంటమాలజీ ఏఈ తిరుపతయ్యకి కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎజాజ్, నర్సింగ్ రావు రామకృష్ణ, నాగరాజు, సురేందర్, తదితరులు ఉన్నారు.