|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 01:53 PM
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణం జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలికకు సెల్ ఫోన్ ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకే కాలనీలో ఉంటున్న ఏడేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు సెల్ ఫోన్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నానమ్మకు అనుమానం రావడంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించగా వృద్దుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.