|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 04:49 PM
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన రాయికల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికుడైన రాము తన ఎలక్ట్రిక్ బైక్‌ను తోట వద్ద నిలిపి పనులు చేసుకుంటుండగా, ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన రాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. క్షణాల్లోనే బైక్ మొత్తం మంటల్లో కాలిపోయింది.
రాము తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది దసరా సందర్భంగా రూ.55,000 ఖర్చు చేసి ఆ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాటరీ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పటికీ, మంటలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని వాపోయాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి దర్యాప్తు ప్రారంభించాలని రాము కోరుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఇలా అగ్నిప్రమాదాలు సంభవించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.