![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:17 PM
సోన్ మండల కేంద్రంలో మంగళవారం "ఒకే దేశం – ఒకే ఎన్నికలు" అంశంపై కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా కోరిపల్లి శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, "ఒకే దేశం ఒకే ఎన్నికలు" అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
ఈ విధానంతో దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు, వనరుల వినియోగం తగ్గి, పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యశాలలో మండల అధ్యక్షుడు మాల గంగారెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, కన్వీనర్ సందుగారి నవీన్, కో-కన్వీనర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.