|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 02:09 PM
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఉండి, ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించే కేంద్రాలుగా నిలుస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
ఈ అభివృద్ధి పనులకు రూ. 8 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. లైబ్రరీ సెస్ ద్వారా వచ్చే నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించి, మరిన్ని లైబ్రరీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రజలు చదువుపట్ల ఆసక్తిని పెంచుకోవాలని నేతలు ఆకాంక్షించారు.