|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 05:08 PM
ప్రముఖ నటుడు విశాల్ పెళ్లి వ్యవహారం మరోసారి కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను త్వరలోనే ఓ ఇంటివాడిని కాబోతున్నానని, తన జీవిత భాగస్వామిని ఇప్పటికే కనుగొన్నానని విశాల్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో, ఆ అమ్మాయి హీరోయిన్ సాయి ధన్సికనే అంటూ వార్తలు బలంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.విశాల్, సాయి ధన్సిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరి బంధానికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆమోదం లభించిందని సమాచారం. త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని తమిళనాడుకు చెందిన పలు మీడియా సంస్థలతో పాటు కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వ్యాపించాయి. అయితే, ఈ ప్రచారంపై అటు విశాల్ కానీ, ఇటు సాయి ధన్సిక కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Latest News