|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:43 PM
టాలీవుడ్ నటసింహ బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస హిట్‌లతో జోరుమీదున్నాడు. ఇప్పుడు అతని తదుపరి ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ జతకట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని గతంలో వీరసింహారెడ్డితో హిట్ కొట్టారు. తాజాగా ఇప్పుడు రానున్న ఈ చిత్రం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 8న పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ పై ఇంకా క్లారియు లేదు. రానున్న రోజులలో ఈ సినిమాకి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' క్లైమాక్స్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు
Latest News