|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:43 PM
మంచు మనోజ్‌ను ఉద్దేశించి నటుడు నారా రోహిత్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా మనోజ్‌కు అండగా ఉంటానని అన్నారు. ఆదివారం జరిగిన 'భైరవం' ఈవెంట్‌ను విజయవంతం చేసిన ఏలూరు ప్రజలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. "నిన్న ఏలూరులో 'భైరవం' ఈవెంట్‌తో అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. ఈ ఈవెంట్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బాబాయ్ మంచు మనోజ్ ప్రత్యేకంగా నిలిచాడు. ఆయన ప్రసంగం శక్తివంతమైంది, భావోద్వేగభరితమైంది, హృదయాన్ని కదిలించేదిగా ఉంది. ఏది ఏమైనా, విషయం ఏదైనా.. నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను బాబాయ్. లవ్ యూ!" అని రోహిత్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
Latest News