|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:47 PM
నటి, సురేఖ వాణి కుమార్తెగా గుర్తింపు పొందిన సుప్రీత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ, తనకు దిష్టి తగిలిందని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, "నేను శివయ్యను మాత్రమే నమ్ముతాను. అలాంటి శివయ్యకు నా మీద కోపం వచ్చినట్టుంది. అయినా శివయ్య, అమ్మ, రమణ లేకుండా నేను ఉండలేను. వారు ఉండగా నాకేం కాదు. నాకు గత వారం నుంచి బాగా దిష్టి తగిలింది. త్వరగానే కోలుకుంటాను" అంటూ రాసుకొచ్చారు. సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Latest News