|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 06:23 PM
ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ బాలీవుడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ నిర్వహించిన ఓ టీవీ షో లో ఆయన మాట్లాడారు. చాలామంది బాలీవుడ్ తారలు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే భయపడుతున్నారని, ఇన్ కమ్ టాక్స్, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుండి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటున్నారని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ నటులు మాత్రం అమెరికా ప్రభుత్వ విధానాలను గురించి నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని వాపోయారు. బాలీవుడ్ ప్రముఖుల మౌనం వెనక దర్యాప్తు సంస్థలే ఉన్నాయని అన్నారు. ఇవాళ బాలీవుడ్ ను వెనకుండి నడిపిస్తోంది బడా పారిశ్రామికవేత్తలే అని చెబుతూ, వారితో పోరాడేంత పెద్దవారు సినిమా తారలు కాదని జావేద్ అక్తర్ చెప్పారు. ఫిల్మ్ స్టార్స్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు, విలాసవంతమైన జీవితం ఉన్నా... వారు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయంలో సామాన్యుల తరహాలోనే వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు.
Latest News