|
|
by Suryaa Desk | Sat, Sep 27, 2025, 02:51 PM
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ‘దేవర 2’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. “దేవర 2కి సిద్ధంగా ఉండండి” అంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 27న విడుదలైన ‘దేవర’ మంచి విజయాన్ని సాధించగా, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు విడుదలైన పోస్టర్‌తో సీక్వెల్‌కు సంబంధించిన హైప్ మరింత పెరిగింది.
Latest News