వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 04:39 PM
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ప్యాట అశోక్‌కు అండగా నిలుస్తూ, వార్డులో దాదాపు ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, కొందరు తన లక్ష్యం తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని పట్టించుకోనని ఆయన అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ప్యాట అశోక్‌ను ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ అగనూరు బసవేశ్వర్, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డిలను శాలువాలతో సన్మానించారు.