|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 10:11 AM
వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, గురు, శుక్రవారాల్లో వర్ష తీవ్రత పెరగనుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.ఇదే సమయంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు వివరించారు. ఈ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.