|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:05 PM
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళిని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకుంటున్నారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై పర్యటించిన ఆయన, భారత సైనిక సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. సోమవారం (అక్టోబర్ 20) జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాని యుద్ధ విమానాల గగనతల విన్యాసాలను తిలకించి, సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిగ్-29 యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్న తీరును ప్రధాని ఆసక్తిగా గమనించారు. పగలు, రాత్రి వేళల్లో జరిగిన ఈ వైమానిక శక్తి ప్రదర్శనలో నౌకాదళ పైలట్ల నైపుణ్యం, కచ్చితత్వాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ఐఎన్ఎస్ విక్రాంత్ 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తికి, దేశ స్వావలంబన శక్తికి ఒక ప్రబల నిదర్శనమని అభివర్ణించారు.