|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:17 PM
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ చెడు అలవాట్లకు బానిసైంది.. భర్తతో విభేదాలతో విసిగిపోయి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో భర్తను తుదముట్టించింది. స్నేహితుల సలహాతో కూరలో వయాగ్రా మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. కూర వదిలేయడంతో మద్యంలో బీపీ మాత్రలు కలిపి తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను చీరతో ఉరేసి చంపేసింది. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో చోటుచేసుకుందీ ఘోరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సప్తగిరి కాలనీలో కత్తి సురేశ్, మౌనిక నివాసం ఉంటున్నారు. పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంటకు ఇద్దరూ పిల్లలు ఉన్నారు. సురేశ్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల మౌనిక చెడు అలవాట్లకి బానిసగా మారింది. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సురేశ్ ను హత్య చేయాలని మౌనిక ఫ్లాన్ చేసింది. తన బంధువు అరిగే శ్రీజకు తన ప్లాన్ చెప్పి సాయం కోరింది. శ్రీజ మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ, మరో స్నేహితురాలు సంధ్యను మౌనికకు పరిచయం చేసింది. వీరంతా కలిసి సురేశ్ హత్యకు ప్రణాళిక రూపొందించారు.