|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 10:35 AM
TG: హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సుబ్రమణేశ్వర్‌రావు అనే ట్యూషన్ టీచర్ కి రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017 డిసెంబరు 3న బాలిక తల్లిదండ్రులు ఉరికివెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ఆధారాలను కోర్టులో సమర్పించారు. న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా, బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.