|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:19 PM
హైదరాబాద్ నగరంలో అద్దెకు నివసించే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసే దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. తాము సురక్షితంగా ఉన్నామనుకునే ఇంట్లోనే ఓ యజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నగరంలోని మధురానగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి బాత్రూంలో అమర్చిన బల్బులో రహస్య కెమెరా ఉండటాన్ని గుర్తించి నివ్వెరపోయాడు. ఈ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళితే, మధురానగర్‌లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అద్దెకు ఉంటున్న వ్యక్తికి బాత్రూంలోని బల్బుపై అనుమానం వచ్చింది. దాన్ని పరిశీలించగా, అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన సీక్రెట్ కెమెరా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.