|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:12 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే, అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ సీపీఎంను కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.