ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 02:31 PM
పత్తి రైతులు అమ్మకాలపై భయపడవద్దని, దళారుల మాటలు నమ్మి తొందరపడొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రధాని మోడీ సీసీఐకి ఆదేశించారని, 12% తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని వివరించారు. దేశంలో 557, తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కిసాన్ యాప్ ద్వారా దీపావళి తర్వాత కొనుగోలు మొదలవుతుందని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరపాలని నిర్ణయించామని, 2047 వికసిత భారత్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.