|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 08:31 PM
జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డ్ లాంటి వాటిని గెలుచుకోగా.. తాజాగా మరొక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తమ సంస్థలో ఆర్‌టిఐ కేసుల్లో ఉత్తమంగా పనిచేసిన గానూ తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (Best Performing HOD) పురస్కారాన్ని ప్రకటించింది.ఈ అవార్డును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా గురువారం అందుకున్నారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పర్సనల్ డైరెక్డర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉన్నతాధికారులు, ఉగ్యోగులు పాల్గొన్నారు.