|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 08:28 PM
నల్గొండ జిల్లా చిట్యాల మండల తహశీల్దార్ కృష్ణ నాయక్, ఒక రైతు నుండి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా, నల్గొండ ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం 6 గంటలకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు తహశీల్దార్ కృష్ణ నాయక్ ను కార్యాలయంలో విచారిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.