|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 11:23 PM
తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల వ్యాపార విస్తరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. ఇందులో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘మార్వాడీ గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.ఈ జేఏసీకి ఛైర్మన్‌గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిని ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన పిడమర్తి రవి, తెలంగాణలో కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మార్వాడీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణలో కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే, దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. భౌతిక చర్యలు కూడా మినహాయించబోవు. షాపులను ధ్వంసం చేసేంతవరకూ పోరాటం కొనసాగుతుంది’’ అని హెచ్చరించారు.మార్వాడీల వ్యాపార కార్యకలాపాలు రాష్ట్రాన్ని కలుషితంగా మార్చుతున్నాయని, దీన్ని తాము ఏమాత్రం సహించబోమని చెప్పారు. దీపావళి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు వెల్లడించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, కన్వీనర్లతో కలిసి నూతన కమిటీని ఆయన ప్రకటించారు. "మన రాష్ట్రం – మన దుకాణం" అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే, ‘‘మార్వాడీ గో బ్యాక్ జేఏసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారుల గొంతు’’ అని స్పష్టం చేశారు.