|
|
by Suryaa Desk | Sun, Oct 05, 2025, 06:55 PM
తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చిన్ననాటి స్నేహితురాలి భర్త అకాల మరణం చెందారు. ఈ ఆకస్మిక ఘటన పట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.రెండు వారాల క్రితం చింతమడకలో తన స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా, సంబురంగా బతుకమ్మ ఆడిందని కవిత గుర్తు చేసుకున్నారు. ఇప్పుడామె పుట్టెడు దుఃఖంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. విధి బలీయమైనదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం తన తోడుగా ఉండాల్సిన భర్త దూరం కావడంతో స్నేహితురాలు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతమని ఆమె పేర్కొన్నారు.ఈ కష్టం నుంచి తన స్నేహితురాలు, ఆమె కుటుంబ సభ్యులు త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కవిత తెలిపారు. స్నేహితురాలిగా ఈ విషాద సమయంలో ఆమెకు భరోసాగా, అండగా నిలబడటం తన బాధ్యత అని కవిత స్పష్టం చేశారు. మరణించిన స్నేహితురాలి భర్త ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. ఈ మేరకు కవిత సోషల్ మీడియాలో స్పందించారు.