|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 11:16 AM
TG: హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1 నుంచి 6వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ స్కూల్‌లో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగిలిన 50 శాతం సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు కేటాయించారు. పూర్తి వివరాలకు yipschool.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. లేదా 90591 96161 నంబర్‌ను సంప్రదించవచ్చు.