|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 11:14 AM
ముంబై దాడుల్లో 26/11 హీరోగా నిలిచిన మాజీ NSG కమాండో బజరంగ్ సింగ్ (45)ను రాజస్థాన్ పోలీసులు గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. రతన్‌గఢ్‌లో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో అతని నుంచి 200 కేజీల గంజాయితో పాటు డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను తెలంగాణ, ఒడిశా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో ఆయన చురుకైన పాత్ర పోషించాడు. 2021లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.