|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 11:00 AM
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన శీలంవార్ లింగవ్వ (55) అనే మహిళకు జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ అనే నిందితుడు లిఫ్ట్ ఇచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసం హత్య చేశాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద జరిగింది. మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమె బతుకమ్మ పండుగ నిమిత్తం కూతురి ఇంటికి వచ్చింది. మహిళలు ఎవరిని పడితే వారిని నమ్మి లిఫ్ట్ ఎక్కవద్దని పోలీసులు సూచించారు.